కాలుష్యాన్ని తగ్గించేందుకు ,వేసవిలో కరెంటు కొతల ఇబ్బందులను తప్పించుకోవడానికి సౌరశక్తిని వాడటం మేలు.ఐతే ఒక ఇంటికి సోలార్ ప్యానేల్సని అమర్చడానికి చాలా స్థలం కావాలి.ఈ సమస్యను పరిష్కరించడానికి కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఒక వినూత్న ఆవిష్కరణ చేసింది.కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే CSIR అనుబంధ సంస్థ సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇటీవలే ఒక సోలార్ చెట్టును ఆవిష్కరించింది.
దాదాపు 400 చదరపు అడుగుల విస్తీర్నంలోని సోలార్ ప్యానల్స్ ఉత్పత్తి చేసేంత కరెంటును ఈ చెట్టు కేవలం 10 చదరపు అడుగుల విస్తీర్నంలోనే ఉత్పత్తి చేస్తుంది.చెట్ల మాదిరిగానే దీంట్లో ఒక బలమైన లోహపు కాండం ఆధారంగా కొన్ని కొమ్మల్లాంటి నిర్మాణాలు చేసారు.వీటి మీద సోలార్ ప్యానేల్సని బిగిస్తారన్నమాట.ఒక్కో సోలార్ చెట్టుతో 5 కిలోవాట్ల కరెంటును ఉత్పత్తి చేసుకోవచ్చు.
అంతేకాకుండా దీని మీద పడే దుమ్మును కడగటానికి ఇందులో ఒక వాటర్ స్ప్రిన్క్లేర్ సిస్టం కూడా ఉంది.కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ రెడ్డి ఇటీవల ఢిల్లీలో ఆవిష్కరించారు.ఈ తరహ సోలార్ చెట్టు ఒక దాని ఖరీదు 5 లక్షల వరకు ఉంటుంది.ప్రభుత్వం పశ్చిమ బెంగాల్లో మూడు చోట్ల దీన్ని వాడనున్నారు.
No comments:
Post a Comment